Apr 05,2023 14:26
  • ఐపీఎల్‌ మొత్తానికి శ్రేయస్‌, రజత్‌ పటిదార్‌,  విలియమ్సన్‌ దూరం

ఢిల్లీ: వెన్ను గాయంతో బాధపడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ ఐపీఎల్‌ మొత్తానికి దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ''శ్రేయస్‌కు విదేశాల్లో శస్త్రచికిత్స జరగనుంది. పూర్తిగా కోలుకోవడానికి అతడికి కనీసం అయిదు నెలలు పట్టొచ్చు'' అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. జూన్‌ 7న ఆరంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా శ్రేయస్‌ దూరమవుతాడు. శ్రేయస్‌ గైర్హాజరీలో ఐపీఎల్‌లో కోల్‌కతాకు నితీశ్‌ రాణా నాయకత్వం వహిస్తున్నాడు. బెంగళూరు టాప్‌ఆర్డర్‌ బ్యాటర్‌ రజత్‌ పటిదార్‌.. కాలి మడమ గాయంతో ఐపీఎల్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ముంబయి ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా కింద పడి భుజానికి గాయం కావడంతో పేసర్‌ రీస్‌ టాప్లీ కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.