ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ఘాట్లో గల్లంతైన విద్యార్థి లోకేష్ కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, మత్స్యకారులు చేపట్టిన గాలింపు చర్యలు విషాదాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం దురదృష్టవశాత్తు కొండపల్లికి చెందిన దొప్పలపూడి లోకేష్ గల్లంతయిన విషయం తెలిసిందే. ఆ బాలుడి మృతదేహం నీటి ఉధృతికి విజయవాడ ప్రకాశం బ్యారేజీ 55వ గేటు వద్దకు వచ్చి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఓడ్డుకు చేర్చారు. మృతదేహం లభ్యమైందన్న సమాచారం ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలుడి తల్లిదండ్రులు, సిఐ శ్రీను ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు.










