Jun 03,2023 15:04
  •  వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లకు మూడు వేర్వేరు జెర్సీలు

భారత జాతీయ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా ప్రముఖ కంపెనీ అడిడాస్‌ రావడంతో జెర్సీల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అడిడాస్‌ లోగోలను ముద్రించి కొంచెం డిజైన్‌ మార్చిన జెర్సీలను బీసీసీఐ విడుదల చేసింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, శుభ్‌ మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యాతో పాటు మహిళా క్రికెటర్లు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మతి మంధాన కొత్త జెర్సీలు ధరించి చేసిన ప్రత్యేక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అండర్‌-19 నుంచి భారత సీనియర్‌ జట్టు వరకు పురుషులు, మహిళా క్రికెటర్లు ఈ జెర్సీలను ధరించనున్నారు.