Sep 28,2023 14:41

ప్రజాశక్తి-అమరావతి : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వామినాథన్‌ మృతికి సిపిఎం రాష్ట్రకమిటీ ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించింది. స్వామినాథన్‌ మృతి ఆంధ్రప్రదేశ్‌కే కాదు యావత్‌ భారతదేశానికే తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. హరిత విప్లవం వ్యవస్థాపకుడుగా.. వ్యవసాయ సంక్షోభానికి విరుగుడుగా ఆయన చేసిన సిఫార్సులు అత్యంత విలువైనవని.. నేటికీ అనుసరణీయమైనవని తెలిపారు. ఆయన చేసిన కృషికి దేశవిదేశాల్లో అనేక అవార్డులు పొందారన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకూ సానుభూతిని తెలిపారు.