Feb 28,2023 15:52

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (అన్నమయ్యజిల్లా) : విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నమాచార్య కళాశాల ఫార్మసీ ప్రొఫెసర్‌ పి.అనిత తెలియజేశారు. జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని భువనగిరి పల్లె ఆర్చి వద్ద గల శ్రీ చైతన్య పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపల్‌ బాలాజీ ఆధ్వర్యంలో సైన్స్‌ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్‌ అనిత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం వలన శాస్త్ర పురోభివృద్ధిలో ప్రపంచ దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు అనేక శాస్త్రీయ నమూనాలను ప్రదర్శించారు. ఉత్తమ పరిశోధన నమూనాలు రూపోందించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రమణయ్య, కోఆర్డినేటర్‌ కుటుంబరావు, డీన్‌ శివ శంకరయ్య, ప్రైమరీ ఇన్చార్జి శ్రీరామ్‌, సైన్స్‌ ఉపాధ్యాయులు రెడ్డయ్య, వెంకటేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.