ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్యజిల్లా) :ఎన్‌ఎస్‌ఎస్‌స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో పదోసారి ప్రపంచ ఛాంపియన్‌గా శ్రీ చైతన్య పాఠశాల నిలిచి చరిత్ర సృష్టించిందని ఆర్‌ఎస్ రోడ్డులో గల శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆకేపాటి సుధాకర్‌రెడ్డి తెలియజేశారు. ఛాంపియన్‌గా నిలిచినందుకు గానూ మంగళవారం పాఠశాలలో విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కాంటెస్ట్‌లో ప్రపంచ నలుమూలల నుండి 30 పైగా దేశాలు పాల్గొనగా భారత దేశాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత శ్రీ చైతన్య దేనన్నారు. నాసా వారి ఎన్ ఎస్ ఎస్ కాంటెస్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 138 ప్రాజెక్టులలో 89 ప్రాజెక్టులు భారత్ నుంచి ఎంపికవ్వగా అందులో 54 ప్రాజెక్టులు ఒక శ్రీ చైతన్య పాఠశాల నుంచే ఎంపికయ్యాయని తెలిపారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి 18 ప్రాజెక్టులు ఎంపికవ్వగా.. కడప జోన్ నుండి రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ, తృయ స్థానాలలో బహుమతులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర బందానికి శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ బి.ఎస్ రావు, డైరెక్టర్ సీమ, ఏ.జి.ఎం రమణయ్య ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అనూష, డీన్ వెంకటసుబ్బయ్య, కో ఆర్డినేటర్ కుటుంబరావు, సి బ్యాచ్ ఇన్చార్జి శ్రీనివాసులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయ బందం పాల్గొన్నారు.










