Mar 27,2023 18:02

సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి ఏకంగా 517 పరుగులు సాధించాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి దక్షిణాఫ్రికా ప్రపంచరికార్డు సృష్టించడంతో పాటు పలు రికార్డులు కూడా కొల్లగొట్టింది. ఇరు జట్ల ధాటికి నిన్నటి మ్యాచ్‌లో డజన్‌కు పైగా రికార్డులు బద్దలయ్యాయి.

ఆ రికార్డులేవంటే..

  1. వెస్టిండీస్‌ తరఫున ఫాస్టెస్ట్‌ టీ20 హండ్రెడ్‌- జాన్సన్‌ చార్లెస్‌ (39 బంతుల్లో)
  2. సౌతాఫ్రికా తరఫున ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి- క్వింటన్‌ డికాక్‌ (15 బంతుల్లో)
  3. పవర్‌ ప్లే (6 ఓవర్లు)లో అత్యధిక టీమ్‌ టోటల్‌- 102/0 (సౌతాఫ్రికా)
  4. అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 200 పరుగులు పూర్తి చేసిన జట్టు (సౌతాఫ్రికా-13.5 ఓవర్లలో)
  5. మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టు (సౌతాఫ్రికా-149)
  6. అంతర్జాతీయ టీ20ల్లో హైయెస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ రన్‌ ఛేజ్‌ (సౌతాఫ్రికా- 259 టార్గెట్‌)
  7. అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్‌ అత్యధిక టీమ్‌ స్కోర్‌- 258/5
  8. అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికా అత్యధిక టీమ్‌ స్కోర్‌- 259/4
  9. అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 517
  10. అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు- 81
  11. అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు- 35
  12. అంతర్జాతీయ టీ20ల్లో బౌండరీల ద్వారా ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 394