Oct 11,2023 12:44

తెలంగాణ : సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 27కు సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. నవంబర్‌ 30వ తేదీ లోపు ఓటర్‌ లిస్ట్‌ రెడీ చేయాలని స్పష్టం చేసింది. నేడు సింగరేణి ఎన్నికల కీలక విచారణపై హైకోర్టు తీర్పుతో ఉత్కంఠకు తెరలేపింది. ఈ నెల 28 న సింగరేణి లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ లో సింగరేణి యాజమాన్యం అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది.