క్రికెట్‌లో ఓ బౌలర్ హ్యాట్రిక్ తీయడం అత్యంత అరుదు.. అలాంటిది ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్‌లు పడగొట్టాడు ఓ 12 ఏళ్ల కుర్రాడు.. ఓవర్లోని ఆరు బంతులకు ఆరు వికెట్స్ తీశాడు ఒలివర్ వైట్‌హౌజ్. ఇంగ్లండ్‌లోని క్లబ్ బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ తరపున ఒలివర్ వైట్‌హౌజ్ అనే 12 ఏళ్ల కుర్రాడు ఆడుతున్నాడు. ఇటీవల కుక్‌హిల్ - క్లబ్ బ్రోమ్స్‌గ్రోవ్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఓ ఓవర్‌లో ఒలివర్ ఆరు బంతుల్లో ఆరుగురు బ్యాటర్లను ఔట్ చేశాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆరుగురు బ్యాటర్లు బోల్డ్ అవ్వడం. దాంతో ఒకే ఓవర్లో డబుల్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఒలివర్ రెండు ఓవర్లలో మొత్తం 8 వికెట్లు తీసి.. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఇలాంటి ఘనత ఇప్పటివరకూ క్రికెట్ చరిత్రలో నమోదు కాలేదు. దీంతో ఒలివర్ పేరు సోషల్ మీడియాగా వైరల్ అవుతోంది.
🏏 Howzat possible?!
— Tom Edwards ✍️🎙️👨💻 (@tomedwardsbbchw) June 15, 2023
A #Worcestershire boy’s being hailed as a ‘cricketing sensation’ - after bowling out six players in a row, in ONE over! 🤩
Ollie, 12, completed the incredible feat playing for @BoarsCricket
FAO @benstokes38 - can you get this lad in the Ashes squad? 🏏 pic.twitter.com/7bVjx2sgMo










