Oct 19,2022 13:02

అమరావతి : నిరుద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త తెలిపింది. 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఎస్‌బిఐ వెల్లడించింది. అభ్యర్థులకు ఎపిలోని గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.. తెలంగాణలోని హైదరాబాద్‌ సెంటర్లలో రాతపరీక్షలను నిర్వహించనున్నారు.

                                                    నవంబర్‌ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

ఆయా పోస్టుల్లో 1400 రెగ్యులర్‌ ఉద్యోగాలు ఉండగా.. మరో 22 బ్యాక్‌ లాగ్‌ లాగ్‌ ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 7 వరకు ఆయా ఉద్యోగాలకు అభ్యర్థులు అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌బిఐ సూచించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా sbi.co.in, ibpsonline.ibps.in  వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

                                                            పలు రాష్ట్రాల్లో ఉన్న ఖాళీ పోస్టులు...

1422 పోస్టుల్లో అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ , మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహారాష్ట్ర, గోవాకు 212, రాజస్థాన్‌కు 201, తెలంగాణకు 176, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, అండమాన్‌ నికోబార్‌ దీవులకు 175.. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు 175 పోస్టులు రిజర్వ్‌ చేయబడ్డాయి.

                                                                         అర్హతలు...

  • ఎస్‌బిఐ ప్రకటించిన సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలని భావిస్తున్న అభ్యర్థుల వయో పరిమితి 21-30 ఏళ్లుగా ఉండాలి.
  • రిజర్వుడ్‌ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
  • అభ్యర్థులు విద్యార్హత పొందిన తర్వాత రెండేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో అధికారులు పేర్కొన్నారు.
  • ఈ మేరకు ఏదైనా కమర్షియల్‌ లేదా రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌లో ఆఫీసర్‌గా పని చేసిన అనుభవం ఉండాలని సూచించారు.