Mar 11,2023 21:56

సిడ్నీ: ఆస్ట్రేలియా యువ పేసర్‌ జో రికార్డుసన్‌ ఈ సీజన్‌ ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)కు దూరమయ్యాడు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబయి ఇండియన్‌ ఫ్రాంచైజీ తరఫున జో రిచర్డుసన్‌ ఆడాల్సి ఉంది. అలాగే భారత్‌తో మార్చి 17నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కూ అతడు దూరమైనట్లేనని ఆస్ట్రేలియా క్రికెట్‌బోర్డు(సిఏ) శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గత వారమే జో రిచర్డుసన్‌ భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఫొటోలను రిచర్డుసన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 26ఏళ్ల రిచర్డుసన్‌ ఆస్ట్రేలియా తరఫున 3టెస్టులు, 15వన్డేలు, 18టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.