Aug 19,2022 09:30

ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం(ఎన్‌టిఆర్‌ జిల్లా) : పవిత్ర సంగమం ఘాట్‌లో శుక్రవారం ఉదయం ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. కొండపల్లి బాలుర హైస్కూల్లో చదువుతున్న ఆరుగురు విద్యార్థులు శుక్రవారం ఉదయం సరదాగా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్దకు వచ్చారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు నీటిలో దిగగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు. ఇందులో ఒకరిని ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బందం రక్షించింది. గల్లంతు అయిన విద్యార్థి కోటయ్య నగర్‌కు చెందిన దొప్పలపూడి లోకేష్‌గా గుర్తించారు. విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.