Jul 18,2023 11:48

జంగారెడ్డిగూడెం (ఏలూరు) : సాంఘిక సంక్షేమ శాఖా వసతి గృహాలలో ఏలూరు డి సి హెచ్‌ ఎస్‌ అధికారి మోహన్‌ మంగళవారం తనిఖీలు నిర్వహించారు. వసతి గృహాల్లో సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్‌ సత్యన్నారాయణ అందుబాటులో లేకపోవడంతో అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహం లో సమస్యలను కలెక్టర్‌ కు తెలియపరుస్తామని అన్నారు.