Aug 05,2023 11:15

అమరావతి : పుంగనూరు ఘటనపై విచారణకు... డిఐజి అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్‌లకు డిజిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. టిడిపి కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడ్డారని, వాహనాలను సైతం ఉద్దేశపూర్వకంగా తగులపెట్టారని డిజిపి అన్నారు. పుంగనూరు పీఎస్‌లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 మంది టిడిపి నేతలపై కేసు నమోదైంది. ఐపిసి 147, 148, 332, 353, 128 బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామని డిజిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌కి విఘాతం కలిగించిన వారందరిపై కఠినచర్యలు తప్పబోవని స్పష్టం చేశారు. సీసీ కెమెరా పుటేజీని విశ్లేషిస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక మంది నిందితులను గుర్తించామని, మరికొందరి కదలికలపై నిఘా పెట్టామని అన్నారు. చంద్రబాబు రూట్‌ ప్లాన్‌ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందని అన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో ప్రాథమిక సమాచారం ఉందని, రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దఅష్టి పెట్టామని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని డిజిపి రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.