న్యూఢిల్లీ : సామ్‌సంగ్ తన 5జి స్మార్ట్‌ఫోన్ విభాగాన్ని విస్తరించింది. కొత్తగా గెలాక్సీ ఎ14 5జి, గెలాక్సీ ఎ23 5జి ఫోన్లను ఆవిష్కరించింది. మిడ్ సెగ్మెంట్ రేంజ్‌లో ఆవిష్కరించిన ఎ14 ప్రారంభ ధరను రూ.16,499గా ప్రకటించింది. 6జిబి, 128 జిబి వేరియంట్ ధరను రూ.18,999గా పేర్కొంది. ఎ23 5జి ప్రారంభ ధరను రూ.22,999గా నిర్ణయించింది. రెండు మోడళ్లు కూడా జనవరి 20 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో లభిస్తాయని తెలిపింది. రెండు ఫొన్లను 50ఎంపి క్వాడ్ రేర్ కెమెరాతో ఆవిష్కరించింది.
- రిపబ్లిక్ సేల్ ప్రారంభం
సామ్‌సంగ్ షాప్ యాప్, తమ స్టోర్లలో రిపబ్లిక్ సేల్‌ను ప్రారంభించినట్లు సామ్‌సంగ్ తెలిపింది. ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై 61 శాతం, టివిలపై 56 శాతం, టాబ్లెట్లు, యాక్సిసరీస్‌పై 63 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నట్లు తెలిపింది. ల్యాప్‌టాప్స్‌పై 10,000 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. కొత్త సామ్‌సంగ్ యాప్ వినియోగదారులకు రూ.6,500 వరకు వెల్కం బెనిఫిట్స్ తగ్గింపును ఇస్తున్నట్లు తెలిపింది.










