Aug 25,2022 16:11

ప్రజాశక్తి - రెడ్డిగూడెం(ఎన్‌టిఆర్‌) : బిసి సంక్షేమ సంఘం రెడ్డిగూడెం మండల అధ్యక్షులుగా మద్దులపర్వ గ్రామానికి చెందిన కాసర్ల మధుసూదన్‌రావును నియమిస్తూ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌ మారేసు నియామక పత్రాన్ని అందజేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రచార కమిటీ చైర్మన్‌ జక్కా శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీ రాణి, మద్దులపర్వ మాజీ సర్పంచ్‌ కోమటి కృష్ణ, పలువురు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు .