ప్రజాశక్తి - చందర్లపాడు (ఎన్‌టిఆర్) : చందర్లపాడు మండలంలోని కొడవటికల్లు గ్రామంలో రూ.కోటి 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి, రూ.16 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గ్రామస్తుడు కందుల సాంబయ్య ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చావల రవిబాబు,జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు, ఎంపీపీ వేల్పుల ఏసమ్మ,ఎంపీటీసీ కందుల కష్ణకుమారి,వైఎస్‌ఆర్ సిపి నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, వెలగపూడి వెంకటేశ్వరరావు, కందుల నాగేశ్వరరావు, వైసిపి నాయకులు , స్థానిక అధికారులు పాల్గొన్నారు.










