Apr 03,2023 19:51

ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఈ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.  రుతురాజ్ గైక్వాడ్ (31 బంతుల్లో 57), డెవాన్ కాన్వే (29 బంతుల్లో 47), శివమ్ దూబే (16 బంతుల్లో 27), మొయిన్ అలీ (13 బంతుల్లో 19), అంబటి రాయుడు (14 బంతుల్లో 27 నాటౌట్), కెప్టెన్ ధోనీ (3 బంతుల్లో 12) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. బెన్ స్టోక్స్ (8), రవీంద్ర జడేజా (3) నిరాశపరిచారు. ఆఖరిలో ధోని కూడా సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని 2 సిక్స్‌లతో 12 పరుగులు చేశాడు. లక్నో బౌలర్‌లో మార్క్‌ వుడ్‌, బిష్ణోయ్‌ తలా మూడు వికెట్లు సాధించగా.. ఆవేష్‌ ఖాన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.

  • దూబే ఔట్‌

16 బంతుల్లో ఓ ఫోర్‌, 3 సిక్సర్లతో 27 పరుగులు చేసిన శివమ్‌ దూబే, రవి భిష్ణోయ్‌ బౌలింగ్‌లో మార్క్‌ వుడ్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • మొయిన్‌ ఆలీ స్టంపౌట్‌

ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వరుసగా 3 ఫోర్లు బాదిన మొయిన్‌ ఆలీ 19 పరుగులు చేసి, భిష్ణోయ్‌ బౌలింగ్‌లో స్టంపౌట్‌ అయ్యాడు.

  • బెన్‌ స్టోక్స్‌ క్యాచ్‌ ఔట్‌

8 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన బెన్‌ స్టోక్స్‌, ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో యష్‌ ఠాకూర్‌కి క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

  • కాన్వే ఔట్‌.. సీఎస్‌కే స్కోర్‌: 121/2

121 పరుగుల వద్ద సీఎస్‌కే రెండో వికెట్‌ కోల్పోయింది. 47 పరుగులు చేసిన కాన్వే వుడ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతానికి సీఎస్‌కే 11 ఓవర్లకు 121 పరుగులు చేసింది. క్రీజులోకి మెయిన్‌ ఆలీ వచ్చాడు.

  • గైక్వాడ్‌ ఔట్‌.. సీఎస్‌కే స్కోర్‌: 110/1

110 పరుగుల వద్ద సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. 57 పరుగులు చేసిన రుత్‌రాజ్‌ గైక్వాడ్‌.. రవి భిష్ణోయ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శివమ్‌ దుబే వచ్చాడు. కాన్వే 45 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • గైక్వాడ్‌ హాఫ్‌ సెంచరీ

ఐపీఎల్‌-2023లో సీఎస్‌కే ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ సాధించాడు. గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌లో 4 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో రుత్‌రాజ్‌ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ సాధించాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్‌ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. కోన్వే (19 బంతుల్లో 25) పరుగులతో ఉన్నారు.

టాస్‌ గెలిచిన లక్నో.. బౌలింగ్‌.. చెన్నై బ్యాటింగ్‌

నాలుగేళ్ల తర్వాత చెపాక్‌లో సీఎస్‌కే తొలి మ్యాచ్‌ ఆడుతోంది. ఐపీఎల్‌-2023లో భాగంగా చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే మాత్రం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా ఆడనుంది. లక్నో ఈ మ్యాచ్‌లో ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. జయదేవ్‌ ఉనద్కట్‌ స్ధానంలో రవిసింగ్‌ ఠాకూర్‌ తుదిజట్టులోకి వచ్చాడు.
తుది జట్లు:
లక్నో సూపర్‌ జెయింట్స్‌ :
కైల్‌ మేయర్స్‌, లోకేష్‌ రాహుల్‌ (కెప్టెన్‌), దీపక్‌ హుడా, మార్కస్‌ స్టోయినిస్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), ఆయుష్‌ బడోని, కనాల్‌ పాండ్యా, అవేష్‌ ఖాన్‌, మార్క్‌ వుడ్‌, రవి భిష్ణోయ్‌, యశ్‌ రవిసింగ్‌ ఠాకూర్‌
చెన్నై సూపర్‌ కింగ్స్‌ : డెవాన్‌ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్‌, మొయిన్‌ అలీ, బెన్‌ స్టోక్స్‌, అంబటి రాయుడు, శివమ్‌ దూబే, ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, మిచెల్‌ సాంట్నర్‌, దీపక్‌ చాహర్‌, రాజవర్ధన్‌ హంగర్గేకర్‌