- ఢిల్లీపై 50 పరుగుల తేడాతో లక్నో గెలుపు
లక్నో: మరో మ్యాచ్‌లో లక్నో జట్టు 50 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత మయర్స్ (73పరుగులు) బ్యాటింగ్‌లో రాణించడంతో లక్నోజట్టు 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 193పరుగుల భారీస్కోర్ చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లో మార్క్‌వుడ్(5/14) బౌలింగ్‌లో మెరవడంతో ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 9వికెట్ల నష్టానికి 143పరుగులే చేయగల్గింది. మయర్స్ కేవలం 38బంతుల్లో 2ఫోర్లు, 7సిక్సర్లుతో 73 పరుగులు చేశాడు. చివర్లో పూరన్(38), బడోనీ(18) చెలరేగారు.

అనంతరం 194 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.కెప్టెన్ డేవిడ్ వార్నర్ చేసిన 56 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. రిలీ రోసౌ 30 పరుగులు, అక్షర్ పటేల్ 16 పరుగులు చేశారు. పృథ్వీషా 12 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ సింగిల్ డిజిట్ కూడా దాటలేకపోయారు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్ 5 వికెట్లు తీసుకోగా, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
లఖ్‌నవూ ఇన్నింగ్స్: రాహుల్ (సి) అక్షర్ (బి) సకారియా 8; మేయర్స్ (బి) అక్షర్ 73; దీపక్ (సి) వార్నర్ (బి) కుల్‌దీప్ 17; కృనాల్ నాటౌట్ 15; స్టాయినిస్ (సి) సర్ఫరాజ్ (బి) ఖలీల్ 12; పూరన్ (సి) పృథ్వీ (బి) ఖలీల్ 36; బదోని (సి) సర్ఫరాజ్ (బి) సకారియా 18; గౌతమ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193; వికెట్ల పతనం: 1-19, 2-98, 3-100, 4-117, 5-165, 6-187; బౌలింగ్: ఖలీల్ 4-0-30-2; ముఖేష్ 4-0-34-0; సకారియా 4-0-53-2; అక్షర్ 4-0-38-1; కుల్‌దీప్ 4-0-35-1
ఢిల్లీ ఇన్నింగ్స్: పృథ్వీ (బి) వుడ్ 12; వార్నర్ (సి) గౌతమ్ (బి) అవేశ్ 56; మార్ష్ (బి) వుడ్ 0; సర్ఫరాజ్ (సి) గౌతమ్ (బి) వుడ్ 4; రొసో (సి) మేయర్స్ (బి) బిష్ణోయ్ 30; పావెల్ ఎల్బీ (బి) బిష్ణోయ్ 1; అమన్ (సి) పూరన్ (బి) అవేశ్ 4; అక్షర్ (సి) మన్కడ్ (బి) వుడ్ 16; కుల్‌దీప్ నాటౌట్ 6; సకారియా (సి) కృనాల్ (బి) వుడ్ 4; ముఖేష్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 143; వికెట్ల పతనం: 1-41, 2-41, 3-48, 4-86, 5-94, 6-112, 7-113, 8-139, 9-143; బౌలింగ్: మేయర్స్ 1-0-7-0; ఉనద్కత్ 3-0-39-0; గౌతమ్ 4-0-23-0; అవేశ్ 4-0-29-2; మార్క్ వుడ్ 4-0-14-5; రవి బిష్ణోయ్ 4-0-31-2










