Jan 13,2023 10:04

కోల్‌కత్తా : ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 39.4ఓవర్లలో 215పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ కుల్దీప్‌(3/51) మిడి లార్డర్‌ బ్యాటర్స్‌ను ఔట్‌ చేయ గా.. పేసర్లు సిరాజ్‌(3/30), ఉమ్రన్‌(2/48) మిగతా పని కానిచ్చారు. అనంతరం టీమిం డియా 43.2ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి గెలిచింది. వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌(64నాటౌట్‌)కి తోడు హార్దిక్‌(36), శ్రేయస్‌(28) బ్యాటింగ్‌లో రాణించారు. చివర్లో ఈడెన్‌ గార్డెన్స్‌ బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటర్స్‌ ఆచితూచి ఆడారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ప్రత్యర్థి లంక బ్యాటర్స్‌ను భారత బౌలర్లు దడపుట్టించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వరుస విరామాల్లో వికెట్లు తీసారు. తొలి వికెట్‌ 29 పరుగులకే కోల్పోయిన లంక.. 2వ వికెట్‌ను 102 పరుగుల వద్ద కోల్పోయిం ది. ఆ తర్వాత కుల్దీప్‌ మాయాజాలం తోడవ్వడం తో 50 పరుగుల వ్యవధి లోనే ఏకంగా 6 వికెట్లు నష్టపోయింది. 152 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కుల్దీప్‌కు లభించగా.. ఈ గెలుపుతో టీమిండియా 2-0తో సిరీస్‌ గెలుచుకుంది. మూడో, చివరి వన్డే ఆదివారం జరగనుంది.
 

                                                            న్యూజిలాండ్‌ టి20 కెప్టెన్‌గా సాంట్నర్‌

భారత పర్యటనకు వచ్చే న్యూజిలాండ్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటిం చింది. ఈ సిరీస్‌కు విలియమ్సన్‌ దూరం కాగా.. స్పిన్నర్‌ సాంట్నర్‌ కెప్టెన్‌గాఎంపికయ్యాడు. మూడు టి20ల సిరీస్‌ 27నుంచి ప్రారంభం కానుంది.