- ధావన్, పంత్ ఔట్
- శివమ్ మావి, ముఖేష్ కుమార్ అరంగేట్రం
- శ్రీలంతో సిరీస్‌కు జట్లను ప్రకటించిన బిసిసిఐ
ముంబయి : స్వదేశంలో శ్రీలంకతో జరిగే టి20 సిరీస్‌కు తొలిసారి హార్దిక్ పాండ్యా సారథ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు. శ్రీలంకతో వచ్చే ఏడాది జరిగే మూడేసి టి20, వన్డే సిరీస్‌లకు బిసిసిఐ మంగళవారం జట్లను ప్రకటించింది. రోహిత్ టి20 సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో అతని స్థానంలో హార్దిక్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించిన బిసిసిఐ.. వన్డే సిరీస్‌కు మాత్రం రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించ నున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. లంకతో మూడు టి20ల సిరీస్ జనవరి 3నుంచి, వన్డే సిరీస్ జనవరి 10నుంచి ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివమ్ మావితో పాటు బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ తొలిసారి అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేయనున్నారు. శివమ్ మావిని మినీ వేలంలో రూ.5.50కోట్లకు గుజరాత్ టైటాన్స్, ముఖేశ్ కుమార్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5.50 కోట్లకు కొనుగోలు చేశాయి. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రవీంద్ర జడేజాకు మరోసారి జట్టులో చోటు దక్కలేదు.
టి20 సిరీస్‌కు జట్టు : హార్దిక్ పాండ్యా(కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభమన్, సూర్యకుమార్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్.
వన్డే సిరీస్‌కు జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.










