గీత ఆర్ట్స్ 2లో బన్నీ వాసు నిర్మిస్తున్న 'కోటబమ్మాళి పీఎస్' సినిమా ఆలస్యం కావటానికి తనకు గాయమవ్వటమే కారణమని హీరో రాహుల్ విజరు తెలిపారు. ఈ సినిమాలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్ర పోషించారు. వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ కీలక పాత్రలో ఉన్నారు. తేజ మార్ని దీనికి దర్శకుడు. 'నన్ను సినిమాలో నుండి తీసేస్తారు అనుకున్నా, ఎందుకంటే అన్ని నెలలు ఎందుకు వెయిట్ చేస్తారు ఎవరైనా, కానీ ఈ సినిమా నిర్మాత, దర్శకులు మాత్రం నా కోసం ఆగారు, అందుకే సినిమా జాప్యం జరిగింది. నిర్మాత, దర్శకుడికి కూడా శుభాకాంక్షలు. నన్ను పెట్టుకున్నందుకు. అదే వేరే వాళ్ళు అయితే నన్ను తీసేసేవాళ్ళేమో. ఇంట్లో కాలిజారిపడిపోవటంతో నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. సినిమా జాప్యానికి మాత్రం నా కాలు విరగటం, నేను పూర్తిగా కోలుకునేంత వరకు వేచి ఉండటం,' అని చెప్పాడు రాహుల్ విజరు.