అంతర్జాతీయ కెరీర్‌లో 75వ శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ శతకంతో చెలరేగాడు. అహ్మదాబాద్ టెస్టు మూడో రోజు ఆటలో నమోదు చేసిన హాఫ్ సెంచరీని.. సెంచరీగా మలిచి అభిమానులను అలరించాడు. కీలక సమయంలో సెంచరీ బాది తన విలువేమిటో చాటుకున్నాడు రన్‌మెషీన్. 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ నమోదు చేసిన విరాట్ కోహ్లీకి మరో శతకం సాధించడానికి దాదాపు 1200 రోజుల సమయం పట్టింది. దీని కోసం 41 టెస్టు ఇన్నింగ్స్‌లను తీసుకోవడం గమనార్హం. తన కెరీర్‌లో అత్యంత ఎక్కువ బంతులను తీసుకొని మరీ సెంచరీ సాధించడం ఇది రెండోసారి. ఇప్పుడు ఆసీస్‌పై 241 బంతుల్లో శతకం చేయగా.. గతంలో ఇంగ్లాండ్‌పై 289 బంతులను తీసుకున్నాడు.
𝟏𝟎𝟎 𝐟𝐨𝐫 𝐊𝐢𝐧𝐠 𝐊𝐨𝐡𝐥𝐢 👑⚡️#INDvAUS #TeamIndia pic.twitter.com/UXGl32n3WL
— BCCI (@BCCI) March 12, 2023










