Mar 20,2023 15:41
  • రెండో టెస్ట్‌లో శ్రీలంకపై ఇన్నింగ్స్‌ 58పరుగుల తేడాతో గెలుపు

వెల్లింగ్టన్‌: శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ జట్టు 2-0తో చేజిక్కించుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండో టెస్ట్‌లో ఆతిథ్య జట్టు శ్రీలంకపై ఇన్నింగ్స్‌ 58పరుగుల తేడాతో గెలిచింది. ఫాలోఆన్‌ ఆడుతూ సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక జట్టు 358పరుగులకు ఆలౌటైంది. టిమ్‌ సౌథీ, టిక్నెర్‌కు మూడేసి, బ్రాస్‌వెల్‌కు రెండు, హెన్రీ, డోగ్‌ బ్రాస్‌వెల్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ జట్టు 580పరుగులు చేయగా.. శ్రీలంక జట్టు 164పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హెన్రీ నికోల్స్‌కు, సిరీస్‌ కేన్‌ విలియమ్సన్‌కు లభించాయి. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ శనివారం(25)నుంచి ప్రారంభం కానుంది.