- బొత్స కార్యాలయం ముందు కెవిపిఎస్ ఆందోళన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిఎస్‌సి-98 క్యాలిఫైడ్ అభ్యర్థులు 2,326 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి కోరారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం ఉదయం విజయవాడలోని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం ముందు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మాల్యాద్రి మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల చివరి రోజన్నా డిఎస్‌సిపై ప్రకటన చేయాలని కోరారు. దళిత, గిరిజన బలహీనవర్గాల వికలాంగులు, మహిళలకు అన్యాయం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌సి-98 సాధన కమిటీ నాయకులు శ్రీనివాసులు, జి మోహన్‌రావు, పి రమణ, పి రమేష్, సుహాసిని, కోమలి, చిన్ని కృష్ణయ్య పాల్గొన్నారు.