న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి కొత్తగా తన మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపివి)లో ఇన్విక్టోను ఆవిష్కరించింది. 7 సీటర్ సామర్థ్యం కలిగిన ఈ కారు ధరను ప్రారంభ ధరను రూ.24.79 లక్షలుగా నిర్ణయించింది. 2.0 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో దీన్ని విడుదల చేసింది. జూన్ నుంచి ఇప్పటి వరకు ఇన్విక్టోకు 6,200 బుకింగ్స్ వచ్చాయని ఆ సంస్థ తెలిపింది.










