ముంబయి : ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.10 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్న సేవింగ్ డిపాజిట్లపై 0.30 శాతం లేదా 30 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ప్రకటించింది. రూ.10 కోట్లకు దిగువ డిపాజిట్లపై యథాతథంగా 2.70 శాతం వడ్డీ రేటు కొనసాగుతుందని పేర్కొంది.










