దుబాయ్: ఇండోర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్ట్ ఇండోర్ పిచ్ రేటింగ్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) సవరించింది. ఇండోర్‌లోని హోల్డర్ స్టేడియంకు ఐసిసి అపెక్స్ బాడీ 'పేలవ' రేటింగ్‌ను ఇంతకుముందు ప్రకటించింది. ఐసిసి జనరల్ మేనేజర్ వసీం ఖాన్, రోజర్ హార్పర్‌లతో కూడిన ఐసిసి అప్పీల్ ప్యానల్ మ్యాచ్ పుటేజీని సమీక్షించి భారతజట్టుకు 3 డీ మెరిట్ పాయింట్లతో కూడిన జరిమానాను విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బిసిసిఐ ఆ రేటింగ్‌పై ఐసిసికి అప్పీల్ చేయగా.. 'సగటు కన్నా తక్కువ' రేటింగ్‌గా మార్పు చేస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టు 9వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.










