ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : ఐఎన్‌ఎస్ సుమిత్ర, రాయల్ నేవీ షిప్ హెచ్‌ఎంఎస్ తమర్ నౌకలు మంగళవారం బంగాళాఖాతంలో సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించాయి. మారిటైమ్ పార్ట్‌నర్ షిప్ విన్యాసాల్లో భాగంగా ఇండో అస్ట్రేలియా నావికాదళాలు నిర్వహిస్తూ ఫ్లైయింగ్ ఆపరేషన్స్, ఫైరింగ్ కార్యకలాపాల్లో అంతర్గత భద్రతను పెంచే విన్యాసాలు చేపట్టాయి.










