Jul 03,2023 20:13

న్యూఢిల్లీ : రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడంలో భారత్‌ నూతన రికార్డ్‌ను సృష్టించింది. ప్రస్తుత ఏడాది జూన్‌లో ఏకంగా రోజుకు 2.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురు దిగుమతి జరిగిందని డేటా అనలాసిస్‌ సంస్థ కెప్లర్‌ తెలిపింది. రష్యా, ఉక్రెయిన్‌ పరిణామాలతో రష్యా చమురు దిగుమతిపై పలు యూరప్‌ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో చౌకగా లభించే ఆ దేశ చమురును భారత్‌ గత కొన్ని నెలలుగా భారీగా దిగుమతి చేసుకుంటూ వస్తోంది. రష్యా చమురు దిగుమతిలో ఇండియన్‌ ఆయిల్‌ టాప్‌లో ఉంది.