Mar 13,2023 14:36

అహ్మదాబాద్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. టెస్ట్‌ మ్యాచ్‌కు నేడు చివరి రోజు కాగా, ఆసీస్‌ టీ బ్రేక్‌ సమయానికి రెండో ఇన్నింగ్స్‌ లో 2 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆసీస్‌ ఆధిక్యం 62 పరుగుల అదిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో మార్నస్‌ లబుషేన్‌ 51, స్టీవ్‌ స్మిత్‌ పరుగులేమీ లేకుండా ఆడుతున్నారు. ఆసీస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ 90 పరుగులు చేసి అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ లో వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ 1, అక్షర్‌ పటేల్‌ 1 వికెట్‌ తీశారు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ లో ఆసీస్‌ 480 పరుగులు చేయగా, భారత్‌ 571 పరుగులు చేసిన విషయం తెలిసిందే.