- ఓపెనర్ స్మతి మంధాన దూరం
- సాయంత్రం గం 6:30 నుంచి 'స్టార్ స్పోర్ట్స్-1'లో ప్రత్యక్ష ప్రసారం
కేప్‌టౌన్: ఐసిసి మహిళల టి20ప్రపంచకప్‌లో దాయాదులు భారత్, పాకిస్థాన్‌లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారతజట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌తో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్, రెండింట్లో పాక్ గెలిచింది. మొత్తంగా టీ20ల్లో రెండు జట్లు 13 సార్లు తలపడగా.. భారత్ 10, పాక్ 3 మ్యాచ్‌ల్లో నెగ్గాయి.
కాగా ఈ మ్యాచ్‌కు స్మతి మంధాన మ్యాచ్‌కు దూరమైంది. ఆసీస్‌తో జరిగిన వార్మప్ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడింది. వేలిగాయం నుంచి ఆమె కోలుకోలేదని హృషికేశ్ కనిత్కర్ విలేఖరుల సమావేశంలో తెలిపారు. విండీస్, దక్షిణాఫ్రికా ముక్కోణపు సిరీస్‌లో గాయపడిన హర్మన్‌ప్రీత్ కౌర్ పూర్తిగా కోలుకుందని మాజీ క్రికెటర్ కనిత్కర్ తెలిపారు. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, జెమీమా బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. కెప్టెన్‌గా దేశానికి అండర్-19 ప్రపంచకప్ అందించిన షెఫాలి వర్మ.. ఇప్పుడు ఓపెనర్‌గా సత్తాచాటాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో చెలరేగిన రిచా ఘోష్, జెమీమా ఫామ్ కొనసాగించాలి. బౌలింగ్ లో రేణుక, శిఖా పాండే, దీప్తి శర్మ రాణిస్తే పాకిస్తాన్‌పై భారత్‌కు విజయం సులువవుతుంది.
టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), యస్తికా బాటియా, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, రాధా యాదవ్, శిఖా పాండే










