Aug 08,2023 13:41

సంగారెడ్డి అర్బన్‌ (హైదరాబాద్‌) : మానసిక ఒత్తిడితో ఐఐటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సంగారెడ్డి శివారులోని కందిలో జరిగింది.

సంగారెడ్డి గ్రామీణ ఎస్సై రాజేశ్‌నాయక్‌ కథనం మేరకు ... ఒడిశాకు చెందిన మమైత (21) గత నెల 26న ఎంటెక్‌ ప్రథమ సంవత్సరంలో చేరారు. సోమవారం తన గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన విద్యార్థులు రాత్రి 10 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. 'నా చావుకు ఎవరూ కారణం కాదు. మానసిక ఒత్తిడి గురవుతున్నాను' అని రాసి ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.