హైదరాబాద్ : ఐపిఎల్ 16వ సీజన్‌లో ఉప్పల్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. వరుసగా మూడు సీజన్లు టీవీల్లో, ఫోన్ లలో ఐపీఎల్ మ్యాచ్‌లు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు ప్రత్యేక్షంగా మైదానంలో ఎంజారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు మాత్రమే కాదు, వచ్చే ఆదివారం కూడా హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఉండటంతో వరుసగా రెండు వారాంతాలు ఫ్యాన్స్‌కు పండుగే. ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన వేదికల్లో హైదరాబాద్ కూడా ఉంది. దాంతో అవుట్‌ఫీల్డ్, పిచ్ విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిష్టాత్మకంగా ఐపీఎల్ జరపాలని హెచ్‌సీఏ పట్టుదలగా ఉంది.
- ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు.. ప్రత్యర్థి జట్లు
ఏప్రిల్ 2 - రాజస్తాన్ - మధ్యాహ్నం 3.30 గంటల నుంచి
ఏప్రిల్ 9 - పంజాబ్ - రాత్రి 7.30 గం. నుంచి
ఏప్రిల్ 18-ముంబై - రాత్రి 7.30 గం. నుంచి
ఏప్రిల్ 24 - ఢిల్లీ - రాత్రి 7.30 గం. నుంచి
మే 4 -కోల్‌కతా -రాత్రి రా. 7.30 గం.నుంచి
మే 13 - లక్నో -రాత్రి మ.3.30 గం. నుంచి
మే 18 - బెంగళూరు - రాత్రి 7:30 గంటల నుంచి










