Apr 01,2023 08:25
  • చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో గెలుపు

అహ్మదాబాద్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-16లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ జెయింట్‌ జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జట్టు ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్‌పై గెలిచింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 178పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఛేదనలో గుజరాత్‌ జెయింట్‌ 19.2 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు కోల్పోయి 182పరుగులు చేసి గెలిచింది. చెన్నై జట్టు తొలుత డెవాన్‌ కాన్వే(1) వికెట్‌ను త్వరగా కోల్పోయింది. ఆ తర్వాత రుతురాజ్‌ గైక్వాడ్‌ కేవలం 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92పరుగులు చేసి సెంచరీకి దగ్గర్లో ఔటయ్యాడు. మొయిన్‌ అలీ(23), శివం దూబే(19) కాస్త ఫర్వాలేదనిపించినా.. బెన్‌ స్టోక్స్‌(7), జడేజా (1) అంబటి రాయుడు(12) నిరాశపరిచారు. గుజరాత్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌, రషీద్‌ ఖాన్‌, షమీకు రెండేసి వికెట్లు దక్కాయి. ఇక గుజరాత్‌ జట్టులో శుభ్‌మన్‌(63), విజరు శంకర్‌(27), సాహా(25), సుదర్శన్‌(22) బ్యాటిం గ్‌లో రాణించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రషీద్‌ ఖాన్‌కు లభించింది.

స్కోరు వివరాలు

చెన్నై : కాన్వే (బి) షమి 1; రుతురాజ్‌ (సి) శుభ్‌మన్‌ (బి) జోసెఫ్‌ 92; మొయిన్‌ అలీ (సి) సాహా (బి) రషీద్‌ 23; స్టోక్స్‌ (సి) సాహా (బి) రషీద్‌ 7; రాయుడు (బి) లిటిల్‌ 12; దూబె (సి) రషీద్‌ (బి) షమి 19; జడేజా (సి) శంకర్‌ (బి) జోసెఫ్‌ 1; ధోని నాటౌట్‌ 14; శాంట్నర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 178; వికెట్ల పతనం: 1-14, 2-50, 3-70, 4-121, 5-151, 6-153, 7-163
బౌలింగ్‌: షమి 4-0-29-2; హార్దిక్‌ 3-0-28-0; లిటిల్‌ 4-0-41-1; రషీద్‌ ఖాన్‌ 4-0-26-2; అల్జారి జోసెఫ్‌ 4-0-33-2; యశ్‌ దయాళ్‌ 1-0-14-0

గుజరాత్‌ : సాహా (సి) దూబె (బి) రాజ్యవర్ధన్‌ 25; శుభ్‌మన్‌ (సి) రుతురాజ్‌ (బి) తుషార్‌ 63; సుదర్శన్‌ (సి) ధోని (బి) రాజ్యవర్ధన్‌ 22; హార్దిక్‌ (బి) జడేజా 8; శంకర్‌ (సి) శాంట్నర్‌ (బి) రాజ్యవర్ధన్‌ 27; తెవాతియా నాటౌట్‌ 15; రషీద్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 182
వికెట్ల పతనం: 1-37, 2-90, 3-111, 4-138, 5-156
బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-29-0; తుషార్‌ దేశ్‌పాండే 3.2-0-51-1; రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌ 4-0-36-3; శాంట్నర్‌ 4-0-32-0; జడేజా 4-0-28-1