Apr 04,2023 21:49

ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. తడబడుతూనే బ్యాటింగ్ చేసిన కెప్టెన్ వార్నర్ 37 పరుగులు చేశాడు. ఓపెనర్ పృథ్వీ షా (7), ఆల్ రౌండ్ మిచెల్ మార్ష్ (4), రిలీ రూసో (0) విఫలమయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ 30, అభిషేక్ పోరెల్ 20 పరుగులు చేయగా, ఆఖర్లో అక్షర్ పటేల్ దూకుడుగా ఆడడంతో ఢిల్లీ స్కోరు 150 మార్కు దాటింది. అక్షర్ పటేల్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ 3, రషీద్ ఖాన్ 3, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు తీశారు.