ఢిల్లీ లక్ష్యం 106పరుగులు.
ముంబయి: మరిజానే కాఫ్(5/15) అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో గుజరాత్ బ్యాటర్స్ పెవీలియన్‌కు క్యూ కట్టారు. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ను కాప్, రాధా యాదవ్(1/19) కట్టడి చేశారు. ఆ తర్వాత శిఖా పాండే(3/29) కూడా రాణించడంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105పరుగులే చేయగల్గింది. హర్లిన్ డియెల్(20), వారేహామ్(22), గరాత్(32) బ్యాటింగ్‌లో రాణించారు.










