Feb 28,2023 16:29

ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్యజిల్లా) : రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీలలో ఎస్‌.అఫ్రీన్‌ బంగారు పతకాలు సాధించిందని గురుదేవ వశిష్ట జూనియర్ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ వై. రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 20 నుండి 22 వరకు విశాఖపట్నంలో జరిగిన అండర్‌ 19 ఎస్‌జిఎఫ్‌ రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీలలో జిల్లా తరపున బాలికల విభాగంలో మా కళాశాల విద్యార్థి ఎస్‌.అఫ్రీన్‌ రెండు బంగారు పథకాలు, ఒక రజిత పథకంతో ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచిందని, బాలుర విభాగంలో పి.కార్తికేయ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడని పథకాలు సాధించిన విద్యార్థులను కరెస్పాండెంట్‌ రమేష్‌తో పాటు కడప జిల్లా ఎస్జీఎఫ్‌ సెక్రటరీ సి. శారదా అభినందించారు.