ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : గణేష్ నిమజ్జనాలు తగిన జాగ్రత్తలు నడుమ జరుగుతున్నాయని, అందుకు అన్ని శాఖల సహకారంతో ఏర్పాటు చేశామని ఎస్‌ఐ ఎస్.శివ ప్రసాద్ అన్నారు. మండలంలోని జొన్నాడ గౌతమి గోదావరిలో నిమజ్జన ప్రదేశాన్ని సిబ్బందితో కలసి ఆదివారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైవే అథారిటీ వారి సహకారంతో భారీ విగ్రహాల నిమజ్జనానికి క్రేన్, అంబులెన్స్ సిద్ధంగా ఉన్నాయన్నారు. గణేష్ భక్తులు పోలీసు వారి ఆజ్ఞలు పాటించి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు, హెచ్సి నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.










