ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజవొమ్మంగి గ్రామానికి చెందిన వెచ్చాం సత్యనారాయణకు స్థానిక శ్రీవిఘ్నేశ్వర తాపీమేస్త్రిల సంఘం నాయకులు ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం ఆదివారం ఇంటికి తిరిగి వచ్చిన సత్యనారాయణను భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు ఈరోజు పరామర్శించి, కొంత ఆర్థిక సహాయం అందజేసి మరి కొంత సహాయం అందజేసేందుకు కఅషి చేస్తామని తెలిపారు. ఆపదలో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు సంఘం ఎప్పుడు ముందుంటుందని, ఇప్పటికే చాలామందికి ఆర్థిక సహాయం చేశామని యూనియన్ నాయకులు నేతల అచ్చారావు, పి.శ్రీను, ఎన్.రామకఅష్ణ, తదితరులు అన్నారు. ఆర్థిక సహాయం అందజేసిన భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులకు సత్యనారాయణ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో తాపీమేస్త్రిల యూనియన్ నాయకులు గొల్లపల్లి శ్రీను, సిగిరెడ్ల వీరబాబు, దేవర రమణ, దేవాడ సత్యనారాయణ, వి.గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.










