Jul 01,2023 21:11

హైదరాబాద్‌ : తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఎఫ్‌టిసిసిఐ) ఎక్సలెన్సీ అవార్డులను జులై 3న ప్రదానం చేయనున్నారు. నగరంలోని హెచ్‌ఐసిసిలో జరగనన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కెటిఆర్‌, ఐటి, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, గ్రీన్‌కో గ్రూప్‌ సిఇఒ, ఎండి అనిల్‌ కుమార్‌ చలమలశెట్టి హాజరు కానున్నారని ఎఫ్‌టిసిసిఐ అధ్యక్షులు అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సలెన్సీ అవార్డ్స్‌ కమిటీ ఛైర్మన్‌ అరుణ్‌ లుహరుక సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మీలా జయదేవ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌ కుమార్‌ సింఘాలతో కలిసి అనిల్‌ అగర్వాల్‌ మాట్లాడారు. 106 ఏళ్ల చరిత్ర కలిగిన ఎఫ్‌టిసిసిఐ ఈ ఏడాదికి గాను ఎంపికైన 22 మంది విజేతల పేర్లను వారు వెల్లడించారు. 23 విభాగాల్లో నామిషన్లు స్వీకరించగా.. 22 కేటగిరీల్లో నామినేషన్లు వచ్చాయన్నారు. ఈ ఏడాది కొత్తగా స్టార్టప్‌ కేటగిరీని ప్రవేశపెట్టామన్నారు.