భువనేశ్వర్: రూర్కెలా వేదికగా జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో భారత్ హవా కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో జర్మనీపై 4-3తో గెలిచిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియానూ చిత్తుచేసింది. ఈ క్రమంలో సోమవారం జర్మనీతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 6-3గోల్స్ తేడాతో జర్మనీపై ఘన విజయం సాధించింది. భారత్ తరఫున కార్తీ, అభిషేక్ రెండేసి గోల్స్ చేశారు. రెండు క్వార్టర్స్ ముగిసే సమయానికే భారత్ 4-2గోల్స్ ఆధిక్యతలో నిలిచింది. మూడో క్వార్టర్‌లో జర్మనీ ఒక గోల్ చేయగా.. నాల్గో క్వార్టర్‌లో భారత్ మరో రెండు గోల్స్ చేసింది. బుధవారం జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారతజట్టు మరో దఫా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సెల్వమ్ కార్తీకి లభించింది.










