ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం(చిత్తూరు) : గంగాధర నెల్లూరు మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రమాదవశాత్తు శనివారం నల్లమందు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2018 జూన్‌లో జరిగిన ఓ కేసుకు సంబందించిన నల్లమందును సీజ్ చేసి నాశనం చేయడం జరిగింది. ఇందులో కొంత భాగాన్ని ఖీూూ కోసం ఉపయోగించిన నల్లమందును పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మర్రి చెట్టు కింది భాగంలో ఉంచి దానిపై కాంక్రీట్ వేశారు. ఈ క్రమంలో మర్రి చెట్టు దగ్గర చిన్న పాటి పేలుడు సంబవించింది. ఈ పేలుడులో పోలీస్ సిబ్బందికి, స్థానికులకు ఎటువంటి గాయాలు కాలేదు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచిన వాహనాలు స్వల్పంగా దెబ్బతింది. ఇది చాలా చిన్న పేలుడని ఎటువంటి వదంతులను నమ్మవద్దని డిఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ మద్దయ్యచారి, ఎస్‌ఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.











