ప్రజాశక్తి - బిజినెస్ బ్యూరో : ప్రయివేటు రంగంలోని దిగ్గజ గృహ రుణ జారీ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 శాఖలకు విస్తరించినట్లు ప్రకటించింది. తాజాగా తణుకులో కొత్త కార్యాలయాన్ని తెరిచినట్లు పేర్కొంది. ఈ నగర పరిసర ప్రాంతాలలో విస్తరించి ఉన్న వినియోగదారులు తమ కలల ఇంటిని కొనుగోలు చేసేందుకు గహ రుణాలను పొందేందుకు కొత్త కార్యాలయం సౌకర్యవంతంగా ఉంటుందని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజినల్ బిజినెస్ హెడ్ రాజన్ టండన్ పేర్కొన్నారు.










