హైదరాబాద్ : టాటా గ్రూపునకు చెందిన క్రోమా స్టోర్లలో దీపావళి పండగ సందర్బంగా పలు డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై 20 శాతం వరకూ క్యాష్‌బ్యాక్, 24 నెలల వరకూ అతి సులభమైన ఇఎంఐ ఆఫర్లు ఇస్తున్నట్లు పేర్కొంది. పలు బ్యాంక్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లు అక్టోబర్ 30 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.










