Sep 29,2023 22:11
  • 'వాహన మిత్ర' ఐదో విడత నిధుల విడుదలలో సిఎం జగన్‌

ప్రజాశక్తి- భవానీపురం (విజయవాడ) : అవినీతికి తావులేకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహనరెడ్డి చెప్పారు. విజయవాడ విద్యాధరపురంలోని లేబర్‌ కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన వాహనమిత్ర బహిరంగ సభలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 2,75,931 మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ కాబ్‌ డ్రైవర్లకు ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున రూ.275.93 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవర్లకు అండగా ఉంటూ వారిలో భరోసా నింపేందుకు వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. తొలుత సభా వేదికపై ఉన్న వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి సిఎం జగన్‌ పూలమాలవేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఒక్క పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.1300 కోట్లు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వారి గణాంకాలను ఈ సందర్భంగా సిఎం వివరించారు. పేదల కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

4

ఇక కురుక్షేత్రమే...

నిరుపేదల కోసం నిలబడిన తమకు, నిరుపేదలను వంచించిన వారితో వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని సిఎం అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేశామని వివరించారు. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ప్రత్యర్థి పార్టీలకూ, తమకూ మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుందని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని, వారి అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తోన్న తమ ప్రభుత్వం ఒకవైపు, ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ స్కాంల వంటి అనేక స్కాముల్లో మునిగిన వారు మరోవైపు ఉన్నారని చెప్పారు.

ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

సభా ప్రాంగణం వద్ద ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్‌, పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఘనస్వాగతం పలికారు. మచిలీపట్నం ఎంపి వి.బాలసౌరి, విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ ఎంఎల్‌ఎలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, రక్షణ నిధి, వసంత కృష్ణప్రసాద్‌, సామినేని ఉదయభాను, మొండతోక జగన్మోహనరావు, ఎంఎల్‌సి రుహూల్లా, ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎమ్మెల్సీ రూహుల్లా తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

2

రానున్న ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం

నిరుపేదల కోసం నిలబడిన తమకు, నిరుపేదలను వంచించిన వారితో వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేశామని వివరించారు. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ప్రత్యర్థి పార్టీలకూ, తమకూ మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుందని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని, వారి అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తోన్న తమ ప్రభుత్వం ఒకవైపు, ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ స్కాంల వంటి అనేక స్కాముల్లో మునిగిన వారు మరోవైపు ఉన్నారని, వారికీ, తమకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని పేర్కొన్నారు. వారి మాదిరిగా తనకు గజదొంగల ముఠా తోడుగా లేదన్నారు. ఈ సభలో పెద్ద సంఖ్యలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వైసిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.