న్యూఢిల్లీ : సిమెంట్ కంపెనీలు ధరలు పెంచే అవకాశాలున్నాయని ఎంకే గ్లోబల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ అంచనా వేసింది. నవంబర్‌లో ప్రతీ సిమెంట్ బ్యాగ్‌పై రూ.10 నుంచి రూ.30 వరకు పెంచొచ్చని పేర్కొంది. గత నెలలో రూ.3-4 వరకు పెంచినట్లు తెలిపింది. వచ్చే కొన్ని రోజుల్లోనే సిమెంట్ కంపెనీలు ధరలను పెంచనున్నాయని పేర్కొంది. పండగ సీజన్ అక్టోబర్‌లో సిమెంట్ డిమాండ్‌లో తగ్గుదల చోటు చేసుకుందని.. వచ్చే వారాల్లో తిరిగి గిరాకీ పెరగనుందని అంచనా వేసింది.










