Feb 23,2023 12:54

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు రూరల్‌ 30వ డివిజన్‌ తెలుగు గంగ కాలనీలో పిడిఎఫ్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి, టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోక్కిరెడ్డి బాబురెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్‌ కమిటీ కార్యవర్గ సభ్యులు కొండ ప్రసాద్‌, రూరల్‌ కమిటీ సభ్యులు కండె కోటేశ్వరరావు, శాఖ కార్యదర్శి పుల్లలచెరువు శ్రీనివాసులు రెడ్డి, శాఖ సభ్యులు నరికే సీనయ్య నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.