May 12,2023 13:58

విజయవాడ : రాష్ట్రంలో కూడళ్ళు, బహిరంగ ప్రదేశాల్లో రోడ్డు షోలు, సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిఒ నం.1ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటి హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రజాసమస్యలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయకుండా రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను నిరంకుశంగా అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జిఒ నం.1కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడకుండా మరింత పటిష్టంగా జిఒ ను అమలు చేయాలని చూసిందన్నారు. మంత్రుల పర్యటనల పేరుతో ... ముందస్తు అరెస్టులు, గఅహ నిర్బంధాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ప్రజల నిరసనలను లెక్కచేయని వైసిపి ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు అని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పోకడలను విడనాడి పౌరుల ప్రాధమిక హక్కులను కాపాడే చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు.