Jul 07,2023 11:59

విశాఖ : విశాఖ ఉక్కు రక్షణకై ... సిపిఎం ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శిలు 24 గంటల దీక్షలను చేపట్టారు. శుక్రవారం ఉదయం ఈ దీక్షలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... కేంద్ర బిజెపి ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని ఆపాలన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను పూర్తి సామర్థ్యంతో నడపాలని కోరారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వర్కింగ్‌ క్యాపిటల్‌ ఇవ్వాలని, 8,500 మంది నిర్వాసితులకు పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర వైసిపి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన పార్టీలు చిత్తశుద్ధితో కేంద్రంతో పోరాడాలని, స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని ఆపేందుకు పోరాడాలని డిమాండ్‌ చేశారు.

111